Home » Singareni : సింగరేణి కార్మిక నాయకున్నిహెచ్చరించిన సి. కా. స.

Singareni : సింగరేణి కార్మిక నాయకున్నిహెచ్చరించిన సి. కా. స.

మంత్రుల సేవలో మునిగిన నాయకుడు
ఊకదంపుడు ఉపన్యాసాలు మానాలి
కార్మిక సమస్యలు పరిష్కరించాలి
సి. కా. స. కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదల

Singareni : సింగరేణి కార్మిక సంఘానికి చెందిన ఒక ప్రధానమైన నాయకున్నిహెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి అశోక్ గురువారం మీడియా కు లేఖ విడుదల చేశారు. ఆ నాయకుడు నిత్యం మంత్రుల సేవలో మునిగి, తేలుతున్నాడు. తన ప్రాబల్యాన్ని చూపెట్టుకుంటున్నాడు. పయరవీలతో అవినీతి అక్రమాలతో వందల కోట్లు ఆర్జిస్తున్నాడు. అంతే కాదు ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోవాలి. అన్ని వర్గాల కార్మికులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని ఒప్పించాలి. కార్మికుల హక్కులను, డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శి అశోక్ లేఖ విడుదల చేయడంతో కార్మిక వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

సింగరేణి కార్మికులు సాధించిన లాభాలను 40 శాతం ప్రకటించాలని ఆయన ఈ సందర్బంగ డిమాండ్ చేశారు. కనీస పద్దతి పాటించకుండా ప్రతి ఏటా 1 శాతం, అరకొరగా 2 శాతం ఇస్తూ యాజమాన్యం, ప్రభుత్వాలు తమ ఘనతగా ప్రకటించుకోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీన్ని గొప్ప విజయంగా చెప్పుకుంటున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ యూనియన్ లీడర్లు తమ దళారి విధానాన్ని మానుకొని పర్మినెంట్ కార్మికులకు 40శాతం, కాంట్రాక్టు కార్మికులకు 30 వేలకు తగ్గకుండా లాభాల వాటాను ఇప్పించాలని, అందుకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు వ్యవహరించాలని అశోక్ డిమాండ్ చేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు.

ఇది ఇలా ఉండగా లేఖ పై పలు అనుమానాలు సైతం వ్యక్తం కావడం విశేషం. మావోయిస్టు పార్టీతో పాటు దాని అనుబంద సంఘాలపై తీవ్ర నిర్బంధం కొనసాగుతోంది. గతంలో ప్రభాత్ పేరుతొ లేఖలు వచ్చేవి. ఈ నేపథ్యంలో కార్యదర్శి అశోక్ పేరుతొ లేఖ రావడంపై కూడా నిజమైనదా ? నకిలీదా అనే అనుమానాలు సైతం కోల్ బెల్ట్ ప్రాంతంలో వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక యూనియన్ లో లుకలుకలు మొదలైనాయి. ఆ యూనియన్ లో గిట్టనివారిలో ఎవరో ఒకరు ఈ లేఖ ను సృష్టించినట్టుగా సైతం అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు సికాస లేఖ లో ఎప్పుడు కూడా తేదీ ని చేతి రాతతో నమోదు చేస్తారు. తాజా లేఖలో ప్రింట్ తో రావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాత్ పేరు కూడా చేతి రాతతో ఉండేది. ఈ లేఖలో అశోక్ పేరు ప్రింట్ తో ఉండటం కూడా అనుమానాలు వ్యక్తం కావడం విశేషం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *