Home » Hero Prabas : ఆ మీడియా సంస్థకు ప్రభాస్ తో లాభమా ? నష్టమా ?

Hero Prabas : ఆ మీడియా సంస్థకు ప్రభాస్ తో లాభమా ? నష్టమా ?

Hero Prabas : అతి కొద్ది రోజులల్లో వంద సినిమాలు తీయాలి. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సంపాదించాలి. అతి తక్కువ సమయంలో సంపాదనే ధ్యేయంగా దూసుకు వెళుతున్న సంస్థ సినిమాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతోంది. వెంట, వెంట సినిమాలు విడుదల చేస్తోంది. క్వాలిటీ లో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయినప్పటికీ ఆ సంస్థ నిర్మించిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.

దింతో ఆర్థికంగా నష్టపోతోంది. ఇటీవల విడుదల అయిన ” మిస్టర్ బచ్చన్ ” సినిమా అభిమానులకు రుచించలేదు. ఈ సినిమాతో ఆ సంస్థ భారీగా ఆర్థికంగా నష్టపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాకపోవడంతో స్టార్ హీరో ప్రభాస్ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ. ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రభాస్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ప్రభాస్ హీరో గా ‘రాజా సాబ్‌’. సినిమా కు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. 2025 లో అభిమానుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ హీరోగా,” రాజా సాబ్ ” సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ భారీగా పెట్టు బడి పెడుతోంది.

ఇప్పటి వరకు నష్టపోయిన పెట్టుబడిని ప్రభాస్ తో రాబట్టు కోవాలని ఆశిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థను ఇప్పుడు నష్టాల్లో ముంచినా, లాభాల్లో తేల్చినా ప్రభాస్ ప్రధాన కారకుడవుతారు. అందుకే ఆయనపై ఎనలేని ఆశలు పెట్టుకొని రాజా సాబ్ సినిమా నిర్మిస్తోంది ఆ సంస్థ. ఒకవేళ అదృష్టం కలిసి వచ్చిన నేపథ్యంలో 2024 లో జరిగిన ఆర్థిక నష్టాన్ని 2025 లో పూడ్చడానికి ప్రభాస్ ఏ మేరకు కృషి చేయగలడో వేచి చూద్దాం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *