Home » YCP Party : వైసీపి పార్టీ వదిలి వెళుతున్న కీలక నేతలు ?

YCP Party : వైసీపి పార్టీ వదిలి వెళుతున్న కీలక నేతలు ?

YCP Party : వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన కుమార్తె పుట్టిన రోజును ఘనంగా జరుపుకోబోతున్నారు. విదేశాల్లో కూతురు పుట్టిన రోజుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. దాదాపుగా నెల రోజులపాటు జగన్ మోహన్ రెడ్డి విదేశాల్లోనే గడపనున్నారు. ఆయనకు కోర్ట్ అనుమతి కూడా లభించింది.

రాజ్యసభలో వైసీపీ కి ప్రస్తుతం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. వీరిలో పార్టీ నుంచి జంప్ కావడానికి సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం. జగన్ విదేశీ పర్యటన ఖరారు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇదే మంచి అవకాశం అని కొందరు వైసీపీ పార్టీ కి చెందిన రాజ్యసభ సభ్యులు పార్టీ కండువా మార్చుకోడానికి సిద్ధమైనట్టు పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. వైసీపీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఆరుగురు పార్టీ నుంచి వెళ్ళడానికి అన్నీ సర్దుకున్నట్టు తెలిసింది.

జగన్ విదేశాలకు వెళ్ళగానే రాష్ట్రంలో కండువాల మార్పిడి కార్యక్రమం ఆరంభం అవుతుందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కొందరు రాజీనామా చేస్తారని కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. కొందరు ఎంపీలు కూడా సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారని సమాచారం. టీడీపీ లోకి వెళ్ళడానికే వైసీపీ నేతలు సిద్ధమైనట్టు ఏపీలో ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ లో చేరిన తరువాత పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారం మొదలైనది. రాజ్యసభ పదవిని అనుభవిస్తూ పార్టీలో ఉండటం ఇష్టం లేకనే పదవులకు రాజీనామా చేసి టీడీపీ లో కొనసాగడం ఉత్తమమనే అభిప్రాయంతో పార్టీ మారుతున్నట్టు కూడా అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *