Home » మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి

కాసిపేటలో రాజీనామా చేస్తున్న నాయకులు
మందమర్రిలో మంత్రి పర్యటనకు దూరం
మూడేళ్ల సీనియారిటీ లేని నాయకులకు పదవులా అంటూ ఆగ్రహం
పార్టీ మారిన నాయకులకే పదవులా ?

కోల్ బెల్ట్ న్యూస్, మంచిర్యాల :

అధికారంలోకి వచ్చిన అనంతరం ఏ పార్టీకయినా పదవుల పంపకం కష్టంతో కూడుకున్నది. పదేళ్లు రాజకీయ నిరుద్యోగంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి పదవులు పంచితే ఒక బాధ, పంచక పోతే మరొక బాధ ఏర్పడింది. పదేళ్లు ప్రతిపక్షములో ఉండి, అధికారపార్టీని ఎదుర్కొన్న నాయకులకు సరైన గుర్తింపు దక్కపోతే వారు ఆవేదన చెందడం ఖాయం. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడడంతో నాయకుల్లో ఉన్న అసంతృప్తి ఏమిటో పార్టీ పెద్దలకు తెలిసిపోయింది. ఆ వేడి ఇప్పుడు ఖమ్మం, మంచిర్యాల జిల్లా కు పాకింది. ఏకంగా ఎమ్మెల్యే వినోద్ ఇలాకాలో రాజీనామా బాట పట్టారు నాయకులు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గం లోని కాసిపేట మండల నాయకులకు పదవుల దక్కకపోవడంతో ఏకంగా రాజీనామా బాట పట్టారు. చెన్నూర్ ఎమ్మెల్యే , రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి నియోజక వర్గం పరిధిలో కూడా సీనియర్ నాయకుల్లో అసంతృప్తి మొదలైనది. ప్రధానంగా మందమర్రికి చెందిన నాయకులు అసంతృప్తితో ఉన్నారు. మేమేమైనా పార్టీ మారిన వాళ్లమా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులం, పార్టీలో చేరిన నాటినుంచి, నేటి వరకు పార్టీ జెండా మోస్తున్న వాళ్ళను కాదని, పార్టీ సభ్యత్వం లేనివారికి, కనీసం మూడేళ్ల సీనియారిటీ లేనివాళ్లకు పదవులు ఎలా కట్టబెడుతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మందమర్రి పట్టణానికి చెందిన నూకల రమేష్, నోముల ఉపేందర్, బత్తుల రమేష్, సొతుకు సుదర్శన్ నేతలు పార్టీ మారకుండా ఆశతో ఉన్నారు. అయినా గుర్తింపు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తోపాటు దుర్గం నరేష్, బండి సదానందం చేరారు. వీరికి కూడా పదవుల ఆశ పెట్టారు. రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామంటూ హామీ ఇవ్వడంతో నల్లాల ఓదెలు చేరారు. ఆయన ఆశ కూడా నెరవేరకపోవడంతో పట్టణంలో ఒక మాజీ ఎమ్మెల్యేగా స్థిరపడిపోవడం విశేషం. పదవులు రాకపోవడంతో మందమర్రికి చెందిన పలువురు నేతలు మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనకు మందమర్రిలో దూరముండటం కొసమెరుపు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *