Cinema Bone : తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ హీరోయిన్ ప్రేక్షకులను ఆకట్టుకొంది. అభిమానులను సంపాదించుకొంది. ఇకపోతే ఆమె డాన్స్ చూస్తే ప్రభుదేవ ఆమెకు శిష్యుడా అనే అనుమానం వస్తుంది. అంతే కాదు శరీరంలో ఎముకలు ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తక తప్పదు. ఆ హీరోయిన్ ఈతరం అమ్మాయే. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం సినిమాలు అంటే ఇప్పడు వస్తున్న సినిమాలు అంటే తెగ బోర్ వస్తున్నదని ఇటీవల ఆమె మాట్లాడుతూ తన మనసులోని మాట బయట పెట్టింది. పాత తరం సినిమాలంటేనే చాలా ఇష్టం. అంతే కాదు పాత సినిమాల్లోని పాటలంటే మరింత ఇష్టమని ప్రకటించింది.
ప్రధానంగా పల్లెటూరి కథనాలతో ఉన్న సినిమాలంటే మరింత ఇష్టం. పల్లెటూరి కథనాలతో ఉన్న సినిమా చూస్తున్నంత సేపు నాకు నేనుగా మరచిపోతే. అంతేకాదు ఆ సినిమాలో నేనే నటించిన అని ఊహించు కుంటూ చూస్తాను. అందుకే భవిష్యత్తులో ఒక్కసారి అయినా పల్లెటూరి కథతో నిర్మించే సినిమా లో నటించాలనే కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో వేచిచూడాలి. అంతేకాదు చారిత్రాత్మక సినిమాలో కూడా కనీసం ఒక్కసారైనా నటించలనే ఆశ ఉంది. ఆ కోరిక ఎప్పుడు తీరుతదా, అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అని ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. అందుకే ఈతరం సినిమాలంటే బోర్ కొడుతుంది. అందుకనే పాత తరం కథల్లాంటి సినిమా అయితె నటించాలని ఉందని ఆ హీరోయిన్ శ్రీ లీలనిర్మొహమాటంగా చెప్పేసింది.