5 Years Cinima : సినిమా విజయవంతం కావడానికి చాలా ఖర్చు చేస్తారు నిర్మాతలు. గతంలో సినిమా వంద రోజులు ఆడితే ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యేవి. మరి కొన్ని సినిమాలు 50 రోజులు నడిచేవి. ఇంకొన్ని సినిమాలు 100 రోజులు నడిచి పండుగ చేసుకునేవి. ఇంకా చెప్పాలంటే 365 రోజులు నడిచిన సినిమాలు కూడా ఉన్నవి. 50, 100, 365 రోజులు నడిచిన సినిమాలన్నీ కూడా ఒకే థియేటర్లో ఆడినవి కావడం విశేషం. కానీ ఒకే థియేటర్లో ఒకే సినిమా రోజుకు నాలుగు ఆటలు వరుసగా ఐదు సంవత్సరాలు నడిచిన సినిమా ఏదయినా ఇప్పటి వరకు సినీ చరిత్రలో ఉందా ?. అంటే ఉందని బలంగా చెబుతున్నారు సినీ పరిశ్రమ వాళ్ళు. ఆ సినిమా విడుదలై 49 ఏళ్ళు అవుతోంది. ఆ సినిమా పేరు ” షోలే “.
షోలే సినిమా 3 అక్టోబర్, 1973న షూటింగ్ ప్రారంభమైనది. ఈ సినిమా లో ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, హేమా మాలిని, అమితాబ్ బచ్చన్, జయబాధురి, అంజద్ ఖాన్ నటీనటులు. 15 ఆగస్టు 1975 దేశ వ్యాప్తంగా విడుదలై పెద్ద హిట్ సాధించింది. 198 నిముషాలు సినిమా నడిచే సమయం. సినిమా రెండున్నరేళ్ల పాటు ఒకే ప్రాంతంలో షూటింగ్ నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాంనగర్ లోని రాతి గుట్టల్లో నిర్విరామంగా ఒకే చోట రెండున్నరేళ్ల పాటు షూటింగ్ నిర్వహించిన సినిమా బహుశా షోలే ఒక్కటే అని ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమ లో చెప్పుకుంటారు.
బెంగుళూరు హైవే నుండి రామనగర వరకు షూటింగ్ కోసం వెళ్లేందుకు ఒక రహదారిని ప్రత్యేకంగాను చిత్ర బృందం నిర్మించాల్సి వచ్చింది. అక్కడ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక పట్టణాన్ని సైతం నిర్మించారు. అక్కడే ఒక జైలు సెట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు.
షోలే సినిమాలోని ” ఏ దోస్తీ ” అనే పాట సినిమాలో 5 నిముషాలు ఉంటది. ఈ పాట ను చిత్రీకరించడానికి 21 రోజులు పట్టింది. బొంబాయి- పూనా రైల్వే మార్గంలో రైల్ దోపిడీ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి 50 రోజులు పట్టింది. సినిమాలు గబ్బర్ సింగ్ తన శత్రువును చంపే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి 19 రోజులు పట్టింది.
యే దోస్తీ, కోయి హసీనా, మెహబూబా మెహబూబా పాటలు ప్రేక్షకులను, అభిమానులకు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ ” షోలే హింది సినిమా ” వరుసగా ఐదేళ్ల పాటు రోజుకు నాలుగు ఆటలు బొంబాయి పట్టణంలోని మినర్వా థియేటర్ లో ఆడి హిందీ చిత్ర పరిశ్రమకు గొప్ప విజయాన్ని అందించడం విశేషం.