Both CM Target : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము విభజన జరిగి పదేళ్ల కాలం పూర్తయ్యింది. పదేళ్ల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల విభజన సమస్యల గురించి పట్టించుకున్నది అంతంత మాత్రమే. అత్తెసరు సమావేశాలు ఏర్పాటుచేసి మమ అనిపించారు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి.
తాజాగా రెండు రాష్ట్రాల్లో సీఎం భాద్యతలు చేపట్టిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక అడుగు ముందుకు వేశారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి సమావేశమయ్యారు. కానీ గతంలో ప్రస్తుత మాజీ సీఎం లు ఇద్దరు కూడా సమస్యల పరిష్కరానికి ప్రజలు ఆశించిన మేరకు చొరవ తీసుకోలోదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా, ఇద్దరు సీఎం లు వెనుకడుగు వేశారనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి.
అధికారంలో పదేళ్లు ఉన్న కేసీఆర్ విభజన సమస్యలను అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికే ఎక్కువ ప్రయత్నం చేశారనే ఆరోపణలు సైతం వ్యక్తమయ్యాయి. అధికారం పోయిన తరువాత కూడా ఏవ్ సమస్యలతో మరోసారి సెంట్ మెంట్ వాడుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కేసీఆర్. ఈ నేపథ్యంలో తెలంగాణ పై మల్లి ఆంధ్ర పెత్తనం మొదలైనది అంటూ గులాబీ శ్రేణులు గొంతెత్తారు.
ఈ నేపథ్యంలో అధికారం చేపట్టిన ఇద్దరు సీఎం లకు ఎన్నో రాష్ట్ర సమస్యలు ఉన్నప్పటికీ విభజన సమస్యల పరిస్కారం కోసం ముందుకు వచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రాల ప్రయోజనాల కోసం చర్చలు ప్రారంభించి కేసీఆర్ సెంట్ మెంట్ రాజకీయాలకు ఆదిలోనే చెక్ పెట్టాలని కూడా ఇద్దరు సీఎం ల లక్ష్యంగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రెండు రాష్ట్రాల అపరిష్కృత సమస్యలు పరిస్కారం అయితే ప్రజల అభివృద్ధికి బాట వేసిన వారవుతారు ఇద్దరు సీఎం లు.
ఇద్దరు సీఎం లు సమస్యలను పరిష్కరించు కొంటె రాబోయే రోజుల్లో తెలంగాణ సెంట్ మెంట్ వాడుకోడానికి ఏమి ఉండదు. ఇదే జరిగితే మాజీ సీఎం కేసీఆర్ ను భవిష్యత్తులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి కొంత రాజకీయ భారం తగ్గినట్టే అవుతుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.