ys jagan : ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మొహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పనిచేశారు. పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి చెందిన నాటి నుంచి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి చుట్టం చూపుగానే వస్తున్నారు. వరద బాధితుల పరామర్శ విషయంలో కూడా మాజీ సీఎం హోదా స్థాయిలో కాలేదు. కొద్ధి రోజులు ఏపీలో ఉంటున్నారు. మల్లి తిరిగి బెంగుళూర్ వెళుతున్నారు. ఏపీలో ఉండకపోవడంతో విమర్శలు వచ్చినప్పటికీ జగన్ పట్టించుకోవడం లేదు. విమర్శలను పట్టించుకోకుండా యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోతున్నారు.
పార్టీ ఓటమి చెందిన నాటి నుంచి జగన్ ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు బెంగుళూర్ వెళ్లారు. కొద్ది రోజులు ఏపీ లో, మరికొద్ది రోజులు బెంగుళూర్. ఇది ఆయన డైరీలో ఒక బాగమైనది. ఒకవైపు నేతలు పార్టీ విడిచి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇంటికే పరిమితం అయ్యారు. మరోవైపు పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి అండగా ఉండాల్సిన అధినేత పట్టించుకోకపోవడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు బెంగుళూర్ లో ఉంటారో తెలియదు. ఎప్పుడు ఏపీ లో ఉంటారో తెలియదు అంటూ కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల తాడేపల్లి లో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరిగింది. కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు అని నమ్మకం ఏర్పడింది. ఏమైనదో ఏమో కానీ వెంటనే బెంగుళూర్ వెళ్లిపోయారు జగన్. ఆ తరువాత కొద్దిరోజులకు పిఠాపురంలో హంగామా చేశారు. వెంటనే మల్లి బెంగుళూర్ వెళ్లిపోయారు.
పార్టీ కార్యక్రమాలకు జగన్ బెంగుళూర్ నుంచే మంతనాలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచే పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీని పట్టుకొని ఉన్నవారికే భవిష్యత్తు ఉంటుందని. ఉండే వారు ఉండని , పోయే వారి గురించి ఆలోచించడం వృధా అని అంటున్నట్టుగా పార్టీ శ్రేణుల సమాచారం.