actor rajanikanth : ప్రముఖ హీరో రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు హీరో నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ నటులు కూడా నటిస్తున్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది . కూలీ సినిమా షూటింగ్ విశాక బీచ్ రోడ్డు లోనే జరుగుతోంది.
షూటింగ్ జరుగుతున్న విశాఖ బీచ్ రోడ్ సమీపంలోనే కంటైనర్ టెర్మినల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని విదంగా ప్రమాదం జరగడంతో సినిమా చిత్ర బృందం అందరు షాక్ కు గురయ్యారు. షూటింగ్ లో ప్రముఖ నటుడు రజనీకాంత్ ఉన్నారు. సీరియస్ గా షూటింగ్ జరుగుతోంది.
మరోవైపు ప్రమాదం పెద్దగా కనబడుతోంది. మంటలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రమాదం తీవ్రత పెరిగిపోతోంది కంటెయినర్ సమీపంలో ఉన్న ప్రజలంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. ప్రమాదం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పుతోంది.
ప్రమాదం విషయం తెలియడంతో వెంటనే చిత్ర బృందం రక్షణ ఏర్పాట్లు చేసుకొంది. షూటింగ్ నిలిపివేశారు. షూటింగ్ లో ఉన్న రజనీకాంత్ ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి చిత్ర బృందం తరలించారు. దింతో చిత్రం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియకపోతే మంటలు షూటింగ్ ఉన్న ప్రదేశానికి కూడా అంటుకునేవి. దింతో ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. ఏదిఏమైనప్పటికీ కూలీ చిత్ర బృందానికి, హీరో రజనీకాంత్ కు పెద్ద ప్రమాదం తప్పింది.