NIGAMA MEDIA (P) LTD
8.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 21, 2026

ఈనెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

కరీంనగర్‌లో ఈనెల 23న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ శుక్రవారం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధికి తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రజనీష్ వివరించారు.

‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని పాతరేద్దాం’ అనే నినాదంతో నిర్వహించనున్న ఈ మహా పాదయాత్ర ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తన గళాన్ని వినిపించనుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పాదయాత్రకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తదితర ముఖ్య నాయకులు పాల్గొననున్నారని అయన తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ఒకే వేదికపై పాల్గొననున్న నేపథ్యంలో కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మహా పాదయాత్రను విజయవంతం చేసి పార్టీ బలాన్ని, ప్రజల్లో తమకున్న మద్దతును చాటుకోవాలని నాయకులు భావిస్తున్నారు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.