NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 18, 2026

కాసిపేట-1 ఇంక్లైన్ గనిని సందర్శించిన జిల్లా అటవీ అధికారి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ (కాసిపేట):

కాసిపేట-1 ఇంక్లైన్ గనిని ఆసిఫాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) సి.హెచ్. బాలమణి, ఐఎఫ్‌ఎస్., సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ సతీష్, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. గనిలోని పర్యావరణాన్ని పరిశీలించిన జిల్లా అటవీ అధికారి బాలమణి సంతోషం వ్యక్తం చేశారు. గని పరిసరాల్లో పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చూపరులను ఆకట్టుకునే వన్యప్రాణుల చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయని ప్రశంసించారు.

అనంతరం ఉద్యోగులతో మాట్లాడి వారి బాగోగులు, విధులు, పని విధానాలను అడిగి తెలుసుకున్నారు. గని పని స్థలాలను పరిశీలించి ఉద్యోగుల పనితీరు, బొగ్గు ఉత్పత్తి, యంత్రాల పనితీరు తదితర అంశాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేస్తారని, చీకట్లను తొలగించి దేశానికి వెలుగులు పంచుతున్నారని అన్నారు. అసాధ్యమైన పనులను సైతం సుసాధ్యం చేయగల నేర్పరులు సింగరేణి కార్మికులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సతీష్, రక్షణాధికారి సురేష్, సర్వేయర్ రవీందర్, సంక్షేమాధికారి మీర్జా గౌస్ జీషాన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.