NIGAMA MEDIA (P) LTD
6.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 7, 2026

దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖసంతోషాలు, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలందరి ఇళ్లలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించారు.

బీబీపేట్ మండలంలో రేపు పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించనున్న పండుగ సందర్భంగా కొరివి నీరజ ప్రతి సంవత్సరం పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించనున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాలన సజావుగా సాగాలని, గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఏటా భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ప్రజల సంక్షేమం, సుఖసంతోషాలు, మండల అభివృద్ధి ఆకాంక్షిస్తూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆమె కోరుకున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.