దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖసంతోషాలు, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలందరి ఇళ్లలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించారు. బీబీపేట్ మండలంలో రేపు పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించనున్న పండుగ సందర్భంగా కొరివి నీరజ ప్రతి సంవత్సరం పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ...