NIGAMA MEDIA (P) LTD
7.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 1, 2026

‘ప్రేమకు ఎన్నో ముఖాలు’ కథల సంపుటి ఆవిష్కరణ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నవంబర్ 1న స్నేహ ఇన్ ఫంక్షన్ హాల్‌లో ఆవిష్కరణ
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, జిల్లా సాహితీ సంస్కృతి సమితి, మంచిర్యాల సహకారంతో లయన్ సొతుకు రత్న జానకి రచించిన ‘ప్రేమకు ఎన్నో ముఖాలు’ కథల సంపుటి ఆవిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలోని స్నేహ ఇన్ ఫంక్షన్ హాల్‌లో జరగనుంది.

ఈ కార్యక్రమానికి జిల్లా సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షులు దండనాయకుల వామన్ రావు అధ్యక్షత వహించనున్నారు. ముఖ్య అతిథిగా విమల సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జల్లి విద్యాధర్ (ఐఆర్ఎస్) హాజరుకానున్నారు. విశిష్ట అతిథిగా డాక్టర్ మారపల్లి వెంకట రమణ పట్వర్ధన్ పాల్గొననున్నారు.

ఆత్మీయ అతిథులుగా లయన్ సమాజ సేవకులు లయన్ సొతుకు సురేంద్రన్ పాల్గొననుండగా, పుస్తక సమీక్షకులుగా అధ్యాపకులు, దేవగానం నోముల చంద్రశేఖర్ వ్యవహరించనున్నారు. రచయిత్రి లయన్ సొతుకు రత్న జానకి రచించిన ఈ కథల సంపుటిని సాహితీ అభిమానులు, సాహిత్య ప్రియులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.