NIGAMA MEDIA (P) LTD
6.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 30, 2026

మందమర్రి ఏరియాలో రైల్వే సైడింగ్ పనులను పరిశీలించిన కార్పొరేట్ జీఎం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కేకే-1 సీహెచ్‌పీ, పనుల్లో వేగం పెంచాలి 
నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలి
కార్పొరేట్ జీఎం కే. శ్రీనివాసులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి ఏరియాలోని కేకే-1 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), రైల్వే సైడింగ్‌తో పాటు బొగ్గు హ్యాండ్లింగ్ యంత్రాల నిర్వహణ, అభివృద్ధి పనులను కార్పొరేట్ జీఎం (ఈ అండ్ ఎం) కే. శ్రీనివాసులు గురువారం పర్యవేక్షించారు. మందమర్రి ఏరియాకు విచ్చేసిన కార్పొరేట్ జీఎం కే. శ్రీనివాసులుకు ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఇతర ఏరియా అధికారులు స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం కే. శ్రీనివాసులు ఏరియా అధికారులతో కలిసి కేకే-1 సీహెచ్‌పీని, రైల్వే సైడింగ్‌ను విస్తృతంగా తనిఖీ చేశారు. సీహెచ్‌పీలో కొనసాగుతున్న బొగ్గు హ్యాండ్లింగ్ పనులు, యంత్రాల నిర్వహణ, సాంకేతిక అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్లాంట్ పనితీరు సజావుగా కొనసాగేందుకు అవసరమైన సాంకేతిక అంశాలపై పలు సూచనలు చేశారు.

అనంతరం రైల్వే సైడింగ్‌కు చేరుకొని అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాల సాధనకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కే. శ్రీనివాసులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, మందమర్రి ఏరియా డీజీఎం (ఈ అండ్ ఎం) బాలాజీ భగవతి ఝా, కార్పొరేట్ డీజీఎం (ఈ అండ్ ఎం), కేకే ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, డీజీఎం పర్సనల్ సీహెచ్. అశోక్, డీజీఎం సివిల్ మదీనా భాష తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.