రూ.602.26 కోట్ల లాభాల వాటా పంపిణీకి సింగరేణి యాజమాన్యం నిర్ణయం
ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్ కుమార్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న కార్మికులకు లాభాల వాటా చెల్లింపునకు యాజమాన్యం నిర్ణయించింది. 2026 అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో లాభాల వాటా జమ కానుంది. ఈ మేరకు యూనియన్ నాయకులు వాణిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్ కుమార్ వెల్లడించారు.
వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు లాభాల వాటా కింద విభాగాల వారీగా చెల్లింపులు జరగనున్నాయి. అండర్గ్రౌండ్ (UG) కార్మికులకు రూ.602.26, STPP, SUR, CHP విభాగాల కార్మికులకు రూ.476.78 చొప్పున, ఇతర విభాగాల్లో (DEPTS.) పనిచేస్తున్న కార్మికులకు రూ.440.11 చొప్పున లాభాల వాటా అందించనున్నట్లు ప్రకటించారు.
సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, న్యాయమైన ప్రయోజనాల సాధన కోసం గిరింపూ కార్మిక సంఘం తరఫున సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (SCWU–AITUC) నిరంతరం కృషి చేస్తోందని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి ప్రయోజనాల పరిరక్షణకు తమ సంఘం కట్టుబడి ఉంటుందని తెలిపారు.

