NIGAMA MEDIA (P) LTD
16.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, October 14, 2026

యువత భక్తి మార్గంలో పయనించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గంలో నడవాలి
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు

కోల్ బెల్ట్ న్యూస్(ఆర్మూర్):

నేటి యువత చెడు వ్యసనాలకు, పెడదారి పట్టించే అలవాట్లకు దూరంగా ఉంటూ భక్తి భావాన్ని అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. యువతలో ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలు పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

బుధవారం ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మాస పూజ, అన్న వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతినెలా రెండవ బుధవారం మాస పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భక్తి, సేవా భావాన్ని పెంపొందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న అయ్యప్ప సేవా సమితి సభ్యులను ఆయన అభినందించారు.

అంతకుముందు జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయంలో నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మామిడిపల్లి ప్రభు దత్తు గురుస్వామి ఆధ్వర్యంలో మాలధారణ చేసిన స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భోజనానంతరం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములకు తాంబూలాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు పుట్టి మురళి, మీసాల రవి, కోశాధికారి గాజారెడ్డి నర్సారెడ్డి, సహాయ కోశాధికారి షేర్ ఒడ్డెన్న, గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, పెంట జలంధర్, గంగాధర్ గౌడ్, మీసాల రాజేశ్వర్, జన్నపల్లి రంజిత్, ద్యాగ ఉదయ్, నూతుల శ్రీనివాస్, యోగేష్, కౌటిక విజయ్, నరేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేందర్, డీఈ భరత్‌తో పాటు అయ్యప్ప స్వాములు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.