NIGAMA MEDIA (P) LTD
17.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, October 14, 2026

ఈనెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈనెల 30న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సభను ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఇంద్రవెల్లి స్తూపం సాక్షిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ 25న తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత అప్పటి నుంచి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల మధ్య ఉంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు పోరాటాలు చేపడుతూనే, పార్టీ ప్రధాన ఎజెండా అయిన ‘పాంచజన్యం’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఈ క్రమంలోనే ఈనెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ నాయకుడు కావేటి మనోహర్‌కు అప్పగించారు. వీరిని సభ ఇన్‌ఛార్జీలుగా నియమించగా, పలువురు పార్టీ సీనియర్ నాయకులకు సైతం వివిధ బాధ్యతలు అప్పగించారు.

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.