కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని బీబీపేట బస్టాండ్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు, సభ్యులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కార్యదర్శి భాశెట్టి నాగేశ్వర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య సాధన కోసం అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, సోదరభావం వంటి గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.
ప్రజలందరూ గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో పయనిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన సిద్ధాంతాలను తెలుసుకుని దేశ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు.

