NIGAMA MEDIA (P) LTD
17.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 21, 2026

పతకం సాధించడమే విజయం కాదు.. పోరాట స్ఫూర్తే అసలైన గెలుపు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

క్రీడాకారుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి
మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

పతకం సాధించడం ఒక్కటే విజయం కాదని, పోటీలో చివరి వరకు పోరాడే తత్వం, క్రమశిక్షణతో ముందుకు సాగడం, తనపై తనకు నమ్మకం కలిగి ఉండడమే నిజమైన విజయానికి బాటలు వేస్తాయని మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎన్. రాధాకృష్ణ అన్నారు.

ఆదివారం సోమగూడెంలోని త్రినేత్ర ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. కుంగ్‌ఫూ వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంచుతాయని పేర్కొన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి, ప్రతి పోటీని ఒక కొత్త అనుభవంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు.

ప్రభుత్వం, క్రీడా సంఘాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు నిరంతరం సాధన చేయాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన కృషి, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. సింగరేణి ప్రాంతంలో రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు తమ క్రీడాకారులైన కార్మికులను కూడా క్రీడల్లో ప్రోత్సహిస్తోందని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో వివిధ క్రీడా సంఘాలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించినప్పుడు సంస్థ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని జీఎం రాధాకృష్ణ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేకే గ్రూప్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ రాంబాబు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కోశాధికారి కనపర్తి రమేష్‌, ఆర్‌కే కుంగ్‌ఫూ అకాడమీ చైర్మన్‌ దాగం మల్లేష్‌, రాష్ట్ర కుంగ్‌ఫూ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు రాజమల్లు, రాష్ట్ర అధ్యక్షుడు వడ్నాల శ్రీను, ప్రధాన కార్యదర్శి శేఖర్‌, కుంగ్‌ఫూ మాస్టర్లు ప్రసాద్‌, మాటూరి శివ మహేష్‌, పోచంపల్లి వెంకటేష్‌, రంగ రమేష్‌, ప్రవీణ్‌, పీఈటీలు, పీడీలు రాధారాణి, సౌందర్య, రజిత, క్రీడా నిర్వాహకులు, కోచ్‌లు, రిఫరీలు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.