NIGAMA MEDIA (P) LTD
23.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్‌

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

అనర్హత వేటును సవాల్ చేస్తూ ఎస్‌ఎల్‌పీ దాఖలు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసినట్లు తాజా సమాచారం. ఈ పిటిషన్‌ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్‌ అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం అనర్హత పిటిషన్లలో ప్రధాన అంశంగా మారింది. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌ను ఆశ్రయించారు.

అనర్హత పిటిషన్లను స్పీకర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం తెలంగాణ హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని కొట్టివేసి, దానం నాగేందర్‌ 2024 ఏప్రిల్‌ 23 నుంచే శాసనసభ సభ్యుడిగా అనర్హుడని తీర్పు ఇచ్చింది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించే చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఏర్పడిన నేపథ్యంలో రాజకీయంగా కూడా ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా దానం

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.