NIGAMA MEDIA (P) LTD
16 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద జనసేన పార్టీ జెండా సమీపంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని జనసేన మంచిర్యాల జిల్లా నాయకులు తన్నీరు మధుకర్, చుంచు రాజకిరణ్ అన్నారు.

సెప్టెంబర్ 17 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంలో పటేల్ పోషించిన పాత్రను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో అవనూరి రమేష్, మల్లంపల్లి విష్ణువర్ధన్, అవుల సాగర్, పిట్టల సుధాకర్, హర్షిత, సుధాకర్, పవన్, సుధీర్ తదితర జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.