కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద జనసేన పార్టీ జెండా సమీపంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని జనసేన మంచిర్యాల జిల్లా నాయకులు తన్నీరు మధుకర్, చుంచు రాజకిరణ్ అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సెప్టెంబర్ 17 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంలో పటేల్ పోషించిన పాత్రను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో అవనూరి రమేష్, మల్లంపల్లి విష్ణువర్ధన్, అవుల సాగర్, పిట్టల సుధాకర్, హర్షిత, సుధాకర్, పవన్, సుధీర్ తదితర జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});