NIGAMA MEDIA (P) LTD
12.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

అవగాహనతోనే హెచ్ఐవీ నివారణ సాధ్యం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):

అవగాహనతో పాటు నివారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా హెచ్ఐవీని అరికట్టవచ్చని తెలంగాణ ఎయిడ్స్ నివారణ సంస్థ ప్రతినిధులు డాక్టర్ తిరుమల్‌రావు, కే. రమేష్ తెలిపారు. బుధవారం దోమకొండలో వై.ఆర్.జి. కేర్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి, మహిళా గ్రామ సంఘాలను సందర్శించి ఆయా సంస్థల ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. హెచ్ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గోడలపై రాయించిన ప్రచార సందేశాలను పరిశీలించారు. హెచ్ఐవీ నివారణకు గ్రామపంచాయతీ అందిస్తున్న సహకారాన్ని వారు అభినందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో హెచ్ఐవీపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహనతో పాటు తగిన నివారణ చర్యలు, జాగ్రత్తలు పాటించడం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. హెచ్ఐవీ నివారణలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. వై.ఆర్.జి. కేర్ లింక్ వర్కర్ స్కీమ్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వై.ఆర్.జి. కేర్ ఉమ్మడి జిల్లా డీఆర్‌పీ సుధాకర్, గ్రామ కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, అమర్‌నాథ్, చింతల స్వామి, రెడ్‌క్రాస్ మండల అధ్యక్షుడు రవికుమార్, నాయకులు నాగారపు ఎల్లయ్య, శ్యామ్‌కుమార్, గంగా రాములు, రాజయ్య, ఏఎన్‌ఎం సువర్ణ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.