అవగాహనతోనే హెచ్ఐవీ నివారణ సాధ్యం

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): అవగాహనతో పాటు నివారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా హెచ్ఐవీని అరికట్టవచ్చని తెలంగాణ ఎయిడ్స్ నివారణ సంస్థ ప్రతినిధులు డాక్టర్ తిరుమల్‌రావు, కే. రమేష్ తెలిపారు. బుధవారం దోమకొండలో వై.ఆర్.జి. కేర్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి, మహిళా గ్రామ సంఘాలను సందర్శించి ఆయా సంస్థల ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. హెచ్ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గోడలపై రాయించిన ప్రచార సందేశాలను...