NIGAMA MEDIA (P) LTD
14.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 1, 2026

కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస(హైదరాబాద్):
స్థానిక కళలను, కళాకారులను గుర్తించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ కృషి చేస్తున్నాయని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మాచవరం గౌరీశంకర్ తెలిపారు.

తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ది సిటీ పార్క్ హోటల్‌లో జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక సేవకులు, జర్నలిస్టులు, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన కళాకారులను నిర్వాహకులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురికి జాతీయ పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పలువురికి సొసైటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్లను అందజేశారు.

జాడ క్రాంతికుమార్‌కు జాతీయ పురస్కారం

జర్నలిస్టుల విభాగంలో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన **జాడ క్రాంతికుమార్ (టైమ్స్ ఆఫ్ వార్త)**కు జాతీయ పురస్కారం–2026 ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న క్రాంతికుమార్‌ను పలువురు జర్నలిస్టులు, మిత్రులు, స్థానికులు అభినందించారు.

ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ తనకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేసేలా నిజాలను వెలికితీసి, నిష్పక్షపాత సమాచారాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి సాహితీ సామ్రాట్ సూరేపల్లి విజయతో పాటు నిర్వాహకులు మాచవరం గౌరీశంకర్, మాచవరం నరసింహ సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.