NIGAMA MEDIA (P) LTD
7.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, October 12, 2026

యాడారం–శివరామిరెడ్డిపల్లి గ్రామాల్లో స్వాగతతోరణానికి భూమిపూజ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

బీబీపేట మండలంలోని యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల ఉమ్మడి వి.డి.సి. కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో నిర్మించనున్న కమాన్‌ (స్వాగత తోరణం) నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

గ్రామాల అభివృద్ధి, ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వి.డి.సి. కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజల సహకారంతో చేపడుతున్న ఈ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల వి.డి.సి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్లు పాల్గొన్నారు. అలాగే ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామ ప్రజల సమష్టి సహకారంతో చేపడుతున్న ఈ స్వాగత తోరణం నిర్మాణం గ్రామాల అభివృద్ధికి మరింత గుర్తింపును తీసుకురావడంతో పాటు, రెండు గ్రామాల మధ్య ఉన్న ఐక్యతను చాటిచెప్పేలా ఉంటుందని వి.డి.సి. కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు భూమిపూజ విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.