24.4 C
Munich
Sunday, July 26, 2026

Singareni : కాసిపేట గని డిప్యూటీ మేనేజర్ కు సన్మానం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట -1 గని డిప్యూటీ మేనేజర్ వెంకటేష్ ను ఘనంగా సన్మానించారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని యాజమాన్యం వెంకటేశ్ ను సింగరేణి స్థాయి ఉత్తమ అధికారిగా ఎంపిక చేసింది. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ కాసిపేట గని విస్తరణలో సాండ్ స్టోవింగ్, వన్ ఏ టన్నెల్ లో నూతనంగా మ్యాన్ రైడింగ్ ఏర్పాటులో ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతోనే అవి విజయవంతమైనాయన్నారు. అదే విదంగా ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ తో కూడిన ఉత్పత్తి నిర్వహణలో వెంకటేష్ చేసిన కృషి ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ వెంకటేష్ ను ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మి నారాయణ, ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్,కన్నయ్య,టీబిజిక్స్ బైరి శంకర్, రమేష్,పిట్ కమిటీ,సేఫ్టీ కమిటీ తో పాటు పలువురు నాయకులు , కార్యకర్తలు, అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.

అదే విదంగా ఏజెంట్ రాంబాబు, మేనేజర్ సతీష్,రక్షణ అధికారి నిఖిల్, అండర్ మేనేజర్లు, సంక్షేమ అధికారి మీర్జా, సర్వేయర్ ప్రభాకర్,ఖాన్ లు మాట్లాడుతూ వెంకటేష్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజేందర్,సంతోష్,పిట్టల శివ,శ్రీకాంత్,రాజన్,అబ్దుల్ రంజిత్,అశోక్, కార్మికులు పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.