NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

CPM : నష్టపోయిన వ్యాపారస్తులకు పరిహారం ఇవ్వాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CPM : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడెల్పు కారణంగా నష్టపోయిన వ్యాపారస్తులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓ కు సిపిఎం ఆధ్వర్యంలో వ్యాపారస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగ సంకె రవి మాట్లాడుతూ…..

వ్యాపార రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు దుకాణాల తొలగింపుతో ఉపాధి కరువైనదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దుకాణాల తొలగింపుతో ఆ కుటుంబాలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని అన్నారు. గత కొన్నేళ్లుగా చిరువ్యాపారులు వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణాలను కూల్చివేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

వ్యాపారస్తులతో పాటు పలువురి ఇళ్లను కూడా కూల్చివేయడంతో వారంతా కూడా ఆశ్రయం కోల్పోయారన్నారు. దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిదంగా ప్రభుత్వమే కూల్చివేసిన నేపథ్యంలో మరోచోట స్థలం కేటాయించి ఉచితంగా దుకాణం నిర్మించి ఇవ్వాలని సంకె రవి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తగిన న్యాయం చేయని నేపథ్యంలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టే శాంతియుత పోరాటానికి ప్రభుత్వమే భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో అబ్బోజు రమణ CPM పట్టణ కార్యదర్శి,, దాగం రాజారాం జిల్లా కమిటీ సభ్యులు, ఏరియా నాయకులు చల్లూరి దేవదాస్, దాగం శ్రీకాంత్, పాయిరాల రాములుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.