Home » Womens : NFIW ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

Womens : NFIW ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

Womens : బెల్లంపల్లి పట్టణంలో శనివారం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఫెడరేషన్ నాయకులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పలువురు మహిళల ప్రతిభను గుర్తించి ఫెడరేషన్ నాయకురాళ్లు సన్మానించారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా మహిళలను ఉద్దేశించి రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ మాట్లాడుతూ …..

బీజేపీ పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు పెరగడంతో పాటు, అత్యాచారాలు సైతం పెరిగిపోయాయని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సహకార సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సుంకర లక్ష్మి గారు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని, సీనియర్ నాయకురాలు గుండా సరోజ, జూపాక సరోజ, చింతం మీనా తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *