Home » Maharaj : రెండు రోజుల్లో దాకు మహరాజ్… ఎంత వసూలు అంటే….

Maharaj : రెండు రోజుల్లో దాకు మహరాజ్… ఎంత వసూలు అంటే….

Maharaj : బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ” డాకు మహారాజ్ “. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నుంచే వసూళ్ళలో దూసుకు పోతోంది. అభిమానులతో పాటు , ప్రేక్షకులను మెప్పించిన సినిమా కావడంతో వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి.

విడుదల అయిన మొదటి రోజున రూ. 56 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసి బాలయ్య తన సత్తా ఏమిటో చూపించాడు. రెండో రోజు కూడా భారీగానే వసూళ్లు చేసి తగ్గేదేలే అంటోంది. రెండో రోజు కూడ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ : 74 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది.

రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాలకృష్ణ అంచనాలకు తగ్గట్టుగానే వసూళ్లు వస్తాయని చిత్ర బృందం ఆశిస్తోంది. అభిమానుల ఆశయానికి తగ్గట్టుగానే డాకు మహారాజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హిట్ కొట్టిందనే అభిప్రాయాలు పరిశ్రమలో వ్యక్తం కావడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *