14.7 C
Munich
Tuesday, July 28, 2026

OG : ఓజీ లో క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్..ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

OG : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి సినిమా ” బ్రో “. ఆ సినిమా తరువాత ఏపీ రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపారు. అధికారం చేపట్టాక భాద్యతలతో కూడా తీరిక లేకుండానే ఉంటున్నారు. ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఆయన ఒప్పుకున్న మూడు సినిమాల షూటింగ్ నిలిచి పోయింది. ఇప్పుడు ఆ సినిమాలను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. అందులో ఒక సినిమా ” ఓజీ ”

ఓజీ సినిమా నిర్మాణంలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ రాజీపడటం లేదు. ఖర్చుకు వెనుకాడకుండా పెట్టుబడి దారులు నిర్మాణంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాటలు, ఫైట్ షూటింగ్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభిమానుల కోరికకు అనుగుణంగా ఒక స్పెషల్ సాంగ్ ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కానీ ఆ స్పెషల్ సాంగ్ కు ఎంపిక కూడా పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఆమె ఎవరో కాదు…

ఓజీ సినిమా షూటింగ్ అతి తొందరలోనే పూర్తి చేసి అభిమానుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమాలో స్పెషల్ సాంగ్ పై పెట్టుబడి దారులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో ఆ స్పెషల్ సాంగ్ లో నటించే బ్యూటీ ఎవరంటే…. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఆ బ్యూటీ. ఇప్పుడు సోషల్ సాంగ్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుందని చిత్ర బృందం సమాచారం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.