NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Ravi teja : రవితేజకు అర్జెంట్ గా ఏమి కావాలో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Ravi teja : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రవి తేజ సినిమా ఒకటి విజయం సాదించింది అంటే మరో విజయం కోసం అభిమానులు వేచి చూడాల్సిందే. ధమాకా సినిమా అభిమానులకు బోలెడంత ఆనందాన్ని ఇచ్చింది. ధమాకా తరువాత రవి తేజకు విజయాలు లేవు. వరుసగా పరాజయాలే. ధమాకా తరువాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావ్ సినిమాలు కలిసి రాలేదు. వాటి తరువాత ఈగల్, మిస్టర్ బచ్చన్, సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు రవితేజ.

అవి కూడా రవితేజకు చేదునే మిగిల్చాయి. వరుసగా నాలుగు పరాజయాలు కావడంతో రవితేజకు ఇప్పుడు మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రవితేజకు ఏమి కావాలంటే…. నాలుగు సినిమాలతో కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసే సినిమా కావాలి. ప్ర‌స్తుతం మాస్ జాత‌ర(mass jathara) సినిమా షూటింగ్ తో రవితేజ తీరిక లేకుండా ఉన్నారు.

వరుస పరాజయాలతో ఉక్కిరి, బిక్కిరి అవుతున్న రవితేజ కు ఒక మంచి కథ అవసరం ఏర్పడింది. కథ ఎంపిక విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొవాలి. కథ సరిగానే ఉన్నప్పటికీ నిర్మాణంలోనే తేడా రావడంతో పరాజయాలు ఎదురవుతున్నాయనే అభిప్రాయాలు సైతం తెలుగు చిత్ర పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి. హీరో రవి తేజ విజయం సాధించే సినిమా ఎప్పుడు వస్తుందా అని అయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.