Home » Sri Leela : ఆమె డ్యాన్స్ పోటీని తట్టుకోలేక తలపట్టుకున్న హీరోయిన్ శ్రీలీల….

Sri Leela : ఆమె డ్యాన్స్ పోటీని తట్టుకోలేక తలపట్టుకున్న హీరోయిన్ శ్రీలీల….

Sri Leela : తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీలీల, కృతిశెట్టి ఒకేసారి అడుగుపెట్టారు. ఒక్క సినిమాతోనే అభిమానులను సంపాదించుకొన్నారు. అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. అవకాశాలకు కొదువలేకుండ పోయింది. శ్రీ లీల మాదిరిగా ఒక్క సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ లు లేరు. ఇప్పుడు కొత్త తరం కోసం చిత్ర పరిశ్రమ వెతుకులాట మొదలెట్టింది. అందమైన బొమ్మ ఎక్కడ కనిపెడితే అక్కడ వెళ్లిపోతున్నారు సినిమా పెట్టుబడిదారులు. జాన్వీ కపూర్ వచ్చినప్పటికీ స్టార్ మెటీరియల్ గా నిలిచిపోయింది.

ఇప్పుడు చిత్రపరిశ్రమ కళ్ళు భాగ్య శ్రీ పైననే పడినవి. తెలుగులో భాగ్యశ్రీ కి ” మిస్టర్ బచ్చన్ ” తొలి సినిమా. ఈ సినిమా విజయాన్ని అందుకుంటే ఆమెకు పరిశ్రమలో తిరుగులేదనేది పరిశ్రమలో పెద్ద టాక్ నడుస్తోంది. ఆమెకు అందానికి అందం ఉంది. నటనలో తిరుగులేదు. డ్యాన్స్ విరగదీత్తోంది. అంద, చందాలను ప్రదర్శించడంలో ఎవరు కూడా సాటిరారని కూడా తెలుగు పరిశ్రమలో పెద్ద టాక్ నడుస్తోంది. భాగ్యశ్రీ డ్యాన్స్ చూస్తే మాత్రం ప్రభుదేవా, లారెన్స్ లకు డూప్ తయారైనదా అనే చర్చ కూడా నడుస్తోంది

ఇప్పటి వరకు శ్రీలీల డ్యాన్స్ చూసిన వాళ్లు ఆమెకు ఆమె సాటి. ఆమెకు ఎదురులేదు. శ్రీ లీల ను ఢీకొట్టే వారు కూడా చిత్ర పరిశ్రమలో రారు అనే చర్చ జరిగింది. కానీ భాగ్య శ్రీ డ్యాన్స్ చూసిన వారు ఏమంటున్నారంటే, భాగ్య శ్రీ డ్యాన్స్ శ్రీ లీల కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టిందనే చర్చ తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తోంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *