13.2 C
Munich
Tuesday, July 28, 2026

Chiranjeevi : చిరంజీవి తో తన కోరిక తీర్చుకుంటున్నఆ దర్శకుడు…. ఎవరో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Chiranjeevi : ప్రముఖ తెలుగు సినీ నటుడు మెగా స్టార్ చిరంజీవి ” విశ్వంభర ” సినిమా షూటింగ్ తో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది కొత్త సంవత్సరంలో సంక్రాంతికి అభిమానుల ముందుకు తీసుకురాబోతోంది చిత్ర బృందం. అదేవిదంగా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లులుగా ముగ్గురు తెలుగు హీరోయిన్ లు నటిస్తున్నారు. మరో సీనియర్ తెలుగు నటి ఒక ఐటెం సాంగ్ లో చిరంజీవి తో కలిసి డ్యాన్స్ చేయబోతోంది.

” విశ్వంభర ” పూర్తయిన తరువాత తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి మోహన్ రాజా దర్శకత్వంలో నటించబోతున్నారని చిత్ర పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథను సమకూరుస్తున్నారు. కథకు సంభందించిన కసరత్తులు కూడా చెన్నయ్ లో తీరిక లేకుండా జరుగుతున్నాయని తెలిసింది.

మెగా వారసులందరికి సంబంధించిన సినిమాలన్నిటికీ అయన దర్శకత్వం వహించాడు. ఒక్కరే మిగిలిపోయారు. మెగా వారసులందరితో సినిమా తీసిన ఆ దర్శకుడు ఇప్పటి వరకు ఒక్కరితో మాత్రం సినిమా తీయక పోవడం విశేషం. ఆ ఒక్కరే మెగా స్టార్ చిరంజీవి. చిరంజీవితో సినిమా తీయాలనే కోరిక ఇప్పటి వరకు ఆ దర్శకుడికి తీరలేదు. ఇప్పడు ఆ దర్శకుడి కోరిక తీరబోతోంది. ఆ దర్శకుడు ఎవరంటే.

” హరీష్ శంకర్ “. ఇటీవలనే చిరంజీవిని దర్శకుడు హరీష్ శంకర్ కలిసినట్టుగా ఒక మీడియా సంస్థకు హరీష్ శంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. ఒక కథ ను కూడా చిరంజీవికి వివరించారు హరీష్ శంకర్. దాదాపుగా చిరంజీవి కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నారని తెలిసింది. దింతో చిరంజీవితో సినిమా తీయాలనే కోరిక దర్శకుడు హరీష్ శంకర్ కి తీరిపోయింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.