Home » Prabhas Film : ప్రభాస్ కొత్త సినిమా రిలీజ్ తేదీ ఖరారు… అందుకే దిష్టి తీసుకున్నాడు.

Prabhas Film : ప్రభాస్ కొత్త సినిమా రిలీజ్ తేదీ ఖరారు… అందుకే దిష్టి తీసుకున్నాడు.

Prabhas Film : ‘రాజా సాబ్‌’ ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్‌ వీడియో ప్రభాస్ అభిమానుల ముందుకు వచ్చింది. ఆ వీడియో చూసిన అభిమానులు గంతులేస్తున్నారు. కానీ విడుదలైన ఆ వీడియో లో మాటలు ఏమి లేవు. మ్యూజిక్ కూడా లేదు. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఓ కారు నుంచి దిగిన ఫోజుతో ముందుగా కనబడుతాడు ప్రభాస్. ఆ తరువాత స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. అద్దములో తన అందమైన ముఖాన్ని చూసుకుంటాడు. తన దిష్టి తనకే తగులుతున్నది అనుకుంటూ ప్రభాస్ తనకు తానే దిష్టి తీసివేసుకుంటాడు. ఈ దృశ్యం సినిమాలో అతి పెద్ద జోక్ అని సినీ బృందం చెబుతోంది.

దిష్టి తీసివేసుకున్నప్పుడు ఖచ్చితంగా రాజా సాబ్ మాదిరిగానే ప్రభాస్ కనిపిస్తాడు. అందంగా తయారై క్లాస్ లుక్ లో మెరిసిపోతాడు. ఈ సినిమాలో హారర్‌, రొమాంటిక్‌, కామెడీ ప్రేక్షకులను, అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది. ” రాజా సాబ్ ” సినిమాను 2025, ఏప్రిల్ 10న విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *