Home » Mahesh Babu : హీరో మహేష్ బాబు కుటుంబంలో విషాదం …

Mahesh Babu : హీరో మహేష్ బాబు కుటుంబంలో విషాదం …

Mahesh Babu : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు మహేష్ బాబు కుటుంబంలో విషాదం అలుము కొంది. ప్రముఖ సినీ నిర్మాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పలపాటి సూర్యనారాయణ కన్నుమూశాడు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

సూర్యనారాయణ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. అదేవిదంగా తెలుగు దేశం పార్టీకి కూడా తీరని లోటని పార్టీ వర్గాలు ఆయన మృతిపై ఆవేదన వ్యక్తం చేశాయి. సూర్య నారాయణ తెలుగు సినిమాలతోపాటు పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా 24 సినిమాలను నిర్మించాడు. ఉప్పలపాటి సూర్యనారాయణ అన్నదమ్ముల సవాల్, బజార్ రౌడీ, శంఖారావం, అల్లుడు దిద్దిన కాపురం వంటి హిట్ సినిమాలను నిర్మించి అభిమానులను సంపాదించుకున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణకు ఉప్పలపాటి సూర్యనారాయణ బావ అవుతాడు. కృష్ణ రెండో సోదరి లక్ష్మీ తులసి. ఆమెను సూర్య నారాయణ కు ఇచ్చి వివాహం జరిపించారు. అంటే హీరో మహేష్ బాబుకు మామ అవుతాడు. సూర్య నారాయణ మృతి ఘట్టమనేని కుటుంబంలో దు:ఖ సాగరంలో నెట్టేసింది. సూర్య నారాయణ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల్లో మంచి పేరు ఉంది. 1985 లో గుడివాడ నియోజక వర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పై పోటీచేసి ఓటమి పాలయ్యారు

కొన్నేళ్ల కిందట ఏపీ తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నిర్మాత వడ్డే శోభనాద్రీశ్వర రావు సమక్షంలో తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి సూర్యనారాయణ తెలుగు దేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఏపీ లో ముగిసిన ఎన్నికల్లో సూర్యనారాయణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *