14.7 C
Munich
Tuesday, July 28, 2026

Danger Food : ఉప్పు కంటే ప్రమాదం… అది తింటే క్యాన్సర్ జబ్బు వచ్చేస్తుంది.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Danger Food : భోజన ప్రియులు తినే తిండి విషయంలో అసలే సర్దుకుపోరు. కొందరు కారం ఎక్కువగా తింటారు. మరికొందరు ఉప్పు ఎక్కువగా వాడుతారు. కొందరు అయితే మసాలా ఎక్కువగా ఉండాలంటారు. నెయ్యి లేనిదే కొందరికి ముద్దదిగదు. భోజనం చేసిన తరువాత కొందరికి ఎదో ఒకటి స్వీట్ తింటారు. ప్రతిరోజూ పాలు తాగేవారు చెక్కర కూడా అధికంగానే వాడుతారు. చాయ్ తాగే వారు కూడా చక్కెర ఎక్కువగానే వేసుకుంటారు. కానీ మనం ఆరోగ్యముగా ఉండాలంటే మితంగా ఆహార పదార్థాలను తీసుకోవాలంటున్నారు వైద్యనిపుణులు.

కానీ ఉప్పు అధికంగా వాడితే బీపీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. చక్కెర తో తయారైన పదార్థాలు అధికంగా తింటే మధుమేహం తో పాటు అధికంగా బరువు కూడా పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. కానీ మారుతున్న ఆరోగ్య పరిస్థితుల వలన చక్కెరకు సంబంధించిన వాటిని అధికంగా తీసుకుంటే క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలిందని కొందరు వైద్యనిపుణులు చెబుతున్నారు.

చక్కెరకు సంబంధించిన పదార్థాలను అధికంగా తీసుకోవడం వలన అధిక బరువు పెరుగుతారు. అధిక బరువు రావడం వలన శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. చక్కెర ఒక రకమైన ప్రో-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ మాదిరిగా పనిచేస్తుంది. ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. ఇన్సులిన్ స్థాయి పెరగడంతో శరీరంలో మెల్ల,మెల్లగా క్యాన్సర్ వ్యాధి తయారవుతుంది. చక్కెరలో పలు రసాయన పదార్థాలతోపాటు శరీరానికి హానిచేసే కొన్ని లక్షణాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చక్కెర సంబంధిత పదార్థాలు అధికంగా తినడం వలన శరీరంలో ట్యూమర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.

తియ్యటి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. చక్కెరలో ఉండే ఫ్రక్టోజ్ శరీరం లోపల గ్లూకోజ్‌గా మారిపోతుంది. ఫ్రక్టోజ్ శాతం శరీరం ఎక్కువైనప్పుడు ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియ పెరుగుతుంది. దీని వల్ల క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంటుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. చక్కెర శరీరంలో జీర్ణమవుతుంది. అప్పుడు పైరువిక్ ఆమ్లం కూడా శరీరంలో తయారవుతుంది. ఈ ప్రక్రియ వలన కూడా క్యాన్సర్ కణాలు శరీరంలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.