NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Annapoorna Studio : అన్నపూర్ణ సినీ స్టూడియో ఆస్థి విలువ ఇప్పుడు ఎంతో తెలుసా….అబ్బో చాలా ఉంది

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Annapoorna Studio : సినీ పరిశ్రమ అంటే మద్రాస్. మద్రాస్ అంటే సినీ పరిశ్రమ. అటువంటి పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకు రావాలని ప్రముఖ నటుడు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావ్ పట్టుదలతో ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సహకారంతో సినీ స్టూడియో నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. 1976 లో నిర్మాణం పనులు చేపట్టారు. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం పూర్తి అయ్యేనాటికి పరిశ్రమ అంత కూడా మద్రాస్ లోనే ఉంది.

ఎక్కడ తెలుగు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా, సినిమా డెవలపింగ్, డబ్బింగ్, పాటల రికార్డింగ్ తో సహా మద్రాసులోనే పూర్తి అయ్యేవి. సినిమా విడుదల వరకు చేయాల్సిన పనులన్నీ కూడా మద్రాసులోనే జరిగేవి. మద్రాస్ లో స్థిరపడిపోయిన సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించాలనే నాగేశ్వర్ రావ్ తపన ఫలించింది. ఆయన స్టూడియో నిర్మించడంతో సినీ పరిశ్రమ దశల వారీగా హైదరాబాద్ కు చేరుకుంది. నటీ, నటులు కూడా ఒకరి తరువాత, ఒకరు హైదరాబాద్ లో స్థిరపడిపోయారు.

అక్కినేని నాగేశ్వర్ రావ్ సినీ స్టూడియోను అన్నపూర్ణ స్టూడియో పేరుతో నిర్మించారు. సినిమా షూటింగుతో పాటు డబ్బింగ్, రికార్డింగ్, పాటల రికార్డింగ్ తదితర పనులన్నీకూడా అన్నపూర్ణ స్టూడియోలోనే పూర్తయ్యేవి. ఇప్పుడు ఆ స్టూడియో హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదు అయిన సంస్థగా నిలిచిపోయింది. ప్రస్తుతం అక్కినేని నాగేశ్వర్ రావ్ వారసుడు, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున స్టూడియో వ్యవహారాలను చూస్తున్నాడు.

స్టూడియో ఆస్థి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం చెప్పలేనంతగా ఉందనే ప్రచారం చిత్ర పరిశ్రమలో ఉంది. ప్రస్తుతానికి అన్నపూర్ణ స్టూడియో ఆస్థి విలువ సుమారుగా 800 కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉంటుందని చిత్ర పరిశ్రమలో టాక్ ఉంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.