17.5 C
Munich
Tuesday, July 28, 2026

Salman Khan : దేశంలో ఎవరికీ లేని వేతనం…. హీరో సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ జీతం…ఎంతంటే ???

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Salman Khan : సినీ పరిశ్రమకు చెందిన నటీ, నటులు ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని నటీ, నటులు రక్షణ కోసం ప్రైవేట్ బాడీ గార్డ్ లను ఏర్పాటు చేసుకుంటారు. ఆ విదంగా ఏర్పాటు చేసుకున్న బాడీ గార్డ్ ల వేతనాలు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటుందనే ప్రచారం సినీ పరిశ్రమల్లో ఉంది.

కానీ నటుల వద్ద బాడీగార్డుగా పనిచేసే వాళ్లు కోట్లలో డబ్బు సంపాదించే విషయం చాలా మందికి తెలియదు. తాాజాగా హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్​కు ప్రతినెల వేతనం రూపంలో చెల్లించే విషయం ఇటీవలనే పరిశ్రమ వర్గాల ద్వారా తెలిశాయి. ఇది తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. సల్మాన్ ఖాన్ బాడీగార్డు సంపాదన కోట్ల రూపాయల్లో ఉందంటే ఎవరైన నమ్ముతారా? అవును బాలీవుడ్ పరిశ్రమలోని హీరో సల్మాన్ ఖాన్ బాడీగార్డు గురించి తెలిస్తే నమ్మవలసిందే. బాలీవుడ్ హీరోల కంటే బాడీగార్డ్ లే ఎక్కువగా సంపాదిస్తున్నారని పరిశ్రమలో పెద్ద టాక్.

సల్మాన్ ఖాన్ కు బాడీగార్డ్​ గా గుర్మీత్ సింగ్ జాలీ ఉన్నాడు. ఇతను గత ముప్ఫయ్ ఏళ్ల నుంచి భాయ్‌కు బాడీగార్డ్​గా వ్యవహరిస్తున్నాడు. ఇతన్ని షేరా అనే పేరుతో ముద్దుగా చిత్ర పరిశ్రమలో పిలుస్తారు. గుర్మీత్ సింగ్ జాలీ అలియాస్ షేరా వివరాలను ముద్దు, ముద్దుగా తెలుసుకుందాం.

1969లో ముంబయిలో పుట్టిన షేరా జూనియర్ బాడీ బిల్డింగ్​లో ఛాంపియన్‌ టైటిల్ సాధించారు. ఆ తరువాత మిస్టర్ ముంబయ్ టైటిల్ కూడా సాధించారు. 1990 నుంచి బాడీ గార్డుగా ముంబయ్ లో పనిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే 1995 లో నటుడు సల్మాన్ ఖాన్ పరిచయం అయ్యాడు. షేరా వ్యక్తిత్వం గురించి తెలుసుకున్న సల్మాన్ బాయ్ వ్యక్తిగత బాడీ గార్డ్ గా నియమించుకున్నాడు. అప్పటి నుంచి నేటివరకు షేరా బాడీ గార్డుగానే సల్మాన్ బాయ్ కు వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం షేరా వయసు 55 ఏళ్ళు. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఈగ వాలకుండా చూసుకోడానికి షేరా సిద్దంగానే ఉంటాడు. తన ఊపిరి ఉన్నంత వరకు సల్మాన్ భాయ్ తోనే గడుపుతానని ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు షేరా. అంత నమ్మకంగా, అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్న షేరా ప్రతినెల సల్మాన్ ఖాన్ వద్ద తీసుకునే వేతనం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

దేశంలో ఎంతో మంది ఉన్నతాధికారులకు బాడీ గార్డ్ లు ఉన్నారు. వాళ్లకు రాని వేతనం షేరా కు వస్తుందంటే పరిశ్రమలో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం షేరా కు ప్రతి నెల సల్మాన్ ఖాన్ పదిహేను లక్షల రూపాయలను వేతన రూపంలో చెల్లిస్తున్నాడని ఇటీవలనే ఒక ఇంగ్లీష్ మీడియా సంస్థ తన కథనాల్లో పేర్కొంది. అంటే ఏడాదికి షేరా దాదాపుగా రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ విషయం ఇప్పుడు చిత్ర పరిశ్రమల్లో పెద్ద టాక్ అయ్యింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.