Home » Home Minister : కూటమిలో హోం మినిస్టర్ పదవికి ఆయనకే

Home Minister : కూటమిలో హోం మినిస్టర్ పదవికి ఆయనకే

Home Minister : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. 2019 ఎన్నికల కంటే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయినది. 83 శాతం నమోదు కావడంతో కూటమి నాయకులతో పాటు, వైసీపీ నాయకులు సైతం గెలుపు ధీమాలో ఉన్నారు. సర్వే సంస్థలు మాత్రం కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. దీనితో కూటమి అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. గెలుస్తామనే ధీమా ఉన్న నాయకులంతా కూడా మంత్రి పదవి కోసం తహ,తహలాడుతున్నారు. వారి అనుచరులు సైతం మా నాయకుడికి మంత్రి పదవి ఖాయం, పాలనా శాఖ మా నాయకుడికే వస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ షేర్ చేస్తున్నారు. కూటమి గా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు ఇష్టమయిన మంత్రి పదవి కోసం అధినేతలచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కె హోం మినిస్టర్ పదవి ఇవ్వాలని జనసేన సైనికులు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ కు హోం మినిస్టర్ ఇస్తేనే కూటమికి న్యాయం జరిగినట్టు అవుతుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ని తట్టుకునే సామర్థ్యం ఉన్న నాయకుడు . కాబట్టి హోమ్ మినిస్టర్ ఇచ్చినచో ధర్మం పాటించినట్టు అవుతుందని రాజకీయ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికలకు ఆరునెలల ముందు తిరుగుబాటు జెండా ఎగురవేసిన వైసీపీ ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు టీడీపీ లో చేరారు. ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుల కంటే ఎక్కువగా వైసీపీ నాయకులను విమర్శించారు. వైసీపీ కి బద్ద శత్రువు అయ్యారు. వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేవిదంగా విస్తృత ప్రచారం చేశారు. అటువంటి దమ్మున్న నాయకునికి హోం మినిస్టర్ పదవి ఇస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితేనే బాగుంటదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆయన వైసీపీ తో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పోలీస్ కేసులంటే లెక్కేలేదు. వైసీపీ ని ఎదుర్కోవడంలో అందరికంటే అచ్చెన్నాయుడు ముందు ఉంటారు. అధికారం లోకి వస్తే తానే హోమ్ మినిస్టర్ అవుతానని, అప్పుడు అందరి విషయాలు బయటకు వస్తాయని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అనుకూలంగా ఉన్నారు.

సీనియర్ నాయకుడు కళావెంకట్రావు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోడానికి ఇవే చివరి ఎన్నికలంటూ చెప్పుకున్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ పదవి కట్టబెడితే గౌరవంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హోమ్ మినిస్టర్ గా భాద్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది.

పార్టీలో మరో సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా హోమ్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పలు సందర్భాల్లో తన కోరికను బయట పెట్టారు. హోమ్ మినిస్టర్ పదవిపై ఆశ ఉందని తన సన్నిహితుల వద్ద మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. వైసీపీ దాడులకు, పోలీస్ కేసులకు భయపడలేదు. చంద్రబాబును నమ్ముకొని పార్టీ లోనే ఉన్నారు. కూటమి అధికారంలోకి రావాలని ఎంత కోరిక ఉందొ నాయకులకు, అంతే కోరిక కూడా హోం మినిస్టర్ పదవిపై ఉండటం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *