NIGAMA MEDIA (P) LTD
-2.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 28, 2026

పోరాటమే పునాదిగా.. జాతీయ కౌన్సిల్‌లో మేకల దాసు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కార్మిక పోరాటం నుంచి జాతీయ కౌన్సిల్‌ దాకా
AITUC జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక..
మంచిర్యాల కార్మిక ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు
మేకల దాసుకు దక్కిన అరుదైన గౌరవం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న AITUC మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసుకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో నవంబర్ 22 నుంచి 26 వరకు జరిగిన AITUC జాతీయ మహాసభల్లో ఆయన జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో మంచిర్యాల జిల్లా కార్మిక ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించినట్లయింది. విద్యార్థి దశ నుంచే ప్రజా, కార్మిక సమస్యలపై పోరాట బాట పట్టిన మేకల దాసు 2000 సంవత్సరం నుంచి విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, అనంతరం కార్మిక ఉద్యమంలోకి ప్రవేశించారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై జరిగిన పలు ఉద్యమాలు, సమ్మెల్లో ప్రత్యక్షంగా పాల్గొని కార్మికుల హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో ఉద్యమాల సందర్భంగా నమోదైన అక్రమ కేసులను ఎదుర్కొని జైలుకు సైతం వెళ్లారు.

2017లో IFTU నుంచి CPI–AITUCలో చేరిన మేకల దాసు, అనంతరం AITUCలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ కార్మిక ఉద్యమాన్ని విస్తరించేందుకు కృషి చేశారు. తొలుత జిల్లా సహాయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, ఆ తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, ఇతర కార్మిక వర్గాల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇటీవల సెప్టెంబర్‌లో కరీంనగర్‌లో జరిగిన AITUC రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మేకల దాసుకు, తాజాగా బెంగళూరులో జరిగిన జాతీయ మహాసభల్లో జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావడం ఆయన రాజకీయ, కార్మిక ఉద్యమ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలు, కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, సింగరేణి కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత, వేతనాలు, కార్మిక హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై AITUC నిరంతరం పోరాడుతున్న నేపథ్యంలో మేకల దాసుకు జాతీయ కౌన్సిల్‌లో చోటు దక్కడం మంచిర్యాల ప్రాంత కార్మిక సమస్యలకు జాతీయ వేదికపై మరింత బలమైన స్వరం లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రారంభమైన తన ప్రస్థానాన్ని కార్మిక ఉద్యమంలో కొనసాగిస్తూ, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదిగిన మేకల దాసు ఎన్నిక పట్ల AITUC, CPI నాయకులు, కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.