NIGAMA MEDIA (P) LTD
0 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, November 27, 2026

“హక్కులు తెలుసుకోండి.. బాధ్యతలు నిర్వర్తించండి”

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే మహోన్నతమైనది
“రాజ్యాంగమే దేశ ప్రజాస్వామ్యానికి పునాది”
“అంబేద్కర్ ఆశయాలే రాజ్యాంగానికి బలం”
మందమర్రి సీఐ పర్స రమేష్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విలువైన, మహోన్నతమైన రాజ్యాంగమని మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్స రమేష్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు, పౌర బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. గురువారం మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ పర్స రమేష్, ఎస్‌ఐ నరేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వేదిక నాయకులు, సభ్యులతో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సీఐ పర్స రమేష్ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించేలా నిబంధనలు పొందుపరిచారని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అనుభవించడంతో పాటు, అందులో పేర్కొన్న బాధ్యతలను కూడా ప్రతి పౌరుడు నిర్వర్తించాలని సూచించారు. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.

ఎస్‌ఐ నరేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగం వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాలు లభించాయని అన్నారు. ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థకు భారత రాజ్యాంగం పునాది వంటిదని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సంఘాలతో పాటు అంబేద్కర్ ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్‌ఐలు రాజ్యాంగ పుస్తకాన్ని ప్రదర్శించి, అందులో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు రాజ్యాంగాన్ని చదవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆలోచనాపరుల వేదిక నాయకులు రాజయ్య, రామ్ వెంకటేశ్వర్లు, సారయ్య, చిలుముల శ్రీనివాస్, గజ్జల చందర్‌తో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.