NIGAMA MEDIA (P) LTD
5.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, November 20, 2026

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, మోడల్ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు డిమాండ్ చేశారు.గురువారం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్యకు బీఎస్పీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రతి ప్రభుత్వ గురుకులం, సంక్షేమ వసతి గృహంలో సంబంధిత అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అన్నారు. వంటశాలలు, భోజనశాలలు, ఆహార నిల్వ గదుల్లో పరిశుభ్రత పాటించేలా చూడటంతో పాటు సురక్షితమైన తాగునీరు, శుభ్రమైన వంట పాత్రలు, నాణ్యమైన వంట సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఎప్పటికప్పుడు తనిఖీ చేయించాలని, నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లు, సంబంధిత వార్డెన్లు, అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన మౌలిక సదుపాయాలు, సురక్షితమైన వాతావరణం కల్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఈసీ మెంబర్ ఎండీ మాతిన్ ఖాన్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, మందమర్రి మండల అధ్యక్షుడు ఎండీ రహీం బాబా, నాయకులు చింతల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.