ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

సింగరేణి పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు” విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన జీఎం ఎడ్యుకేషనల్ సింగరేణి జీఎం ఎడ్యుకేషనల్ రాజేంద్రప్రసాద్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సింగరేణి జనరల్ మేనేజర్ ఎడ్యుకేషనల్ (కార్పొరేట్)  రాజేంద్రప్రసాద్ సూచించారు. మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్, జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని ఆయన తొలిసారిగా సందర్శించారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు....