NIGAMA MEDIA (P) LTD
4.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 4, 2026

సింగరేణి సమస్యల పరిష్కారానికి శాంతిఖని మైన్‌పై ధర్నా

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
యాజమాన్యానికి వినతిపత్రం అందజేత
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతిఖని మైన్‌పై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంతెన రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ.. శాంతిఖని మైన్‌తో పాటు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సుదీర్ఘంగా ప్రస్తావించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని విడనాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రధానంగా ఐదు డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు.

ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి, సంబంధిత ప్రాంతాల కార్మికులకు అక్కడి హాస్పిటళ్లలోనే ఇన్‌వాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి సింగరేణి కంపెనీకి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి.గనులపై మెటీరియల్ కొరత లేకుండా తగినన్ని పని ముట్లు, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలి.పార్క్స్‌పై ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్)కు సంబంధించి స్పష్టమైన సర్క్యులర్ విడుదల చేయాలి.సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలి.

కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో యాజమాన్యం చొరవ చూపాలని నాయకులు కోరారు. అనంతరం పై సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శాంతిఖని మైన్ మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతిపత్రం  అందజేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో రాజ్ కుమార్, మంతెన భాస్కర్, అమ్జాత్ ఖాన్, రాజేశం, బుచయ్యతో పాటు మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు, యూనియన్ కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.