‘ప్రేమకు ఎన్నో ముఖాలు’ కథల సంపుటి ఆవిష్కరణ
నవంబర్ 1న స్నేహ ఇన్ ఫంక్షన్ హాల్లో ఆవిష్కరణ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, జిల్లా సాహితీ సంస్కృతి సమితి, మంచిర్యాల సహకారంతో లయన్ సొతుకు రత్న జానకి రచించిన ‘ప్రేమకు ఎన్నో ముఖాలు’ కథల సంపుటి ఆవిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలోని స్నేహ ఇన్ ఫంక్షన్ హాల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి జిల్లా సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షులు దండనాయకుల వామన్...