NIGAMA MEDIA (P) LTD
8.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, October 12, 2026

అక్టోబర్ 13న కామ్రేడ్ గుండా మల్లేష్ ఆరవ వర్ధంతి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
సీపీఐ పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): 

అమరజీవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ మాజీ సభ్యులు, మాజీ శాసనసభ సీపీఐ పక్షనేత కామ్రేడ్ గుండా మల్లేష్ ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు బెల్లంపల్లిలో నిర్వహించనున్నట్లు సీపీఐ బెల్లంపల్లి పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

బెల్లంపల్లిలోని సీపీఐ కార్యాలయం బాసెట్టి గంగారాం విజ్ఞాన్ భవన్‌లో ఈ వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కామ్రేడ్ గుండా మల్లేష్‌కు నివాళులర్పించాలని కోరారు.

పార్టీ శ్రేణులు, ప్రజలు తమ సమయాన్ని కేటాయించి సకాలంలో కార్యక్రమానికి హాజరై, వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆడెపు రాజమౌళి విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.