NIGAMA MEDIA (P) LTD
3.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 25, 2026

మందమర్రిలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఏజీఎం ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఉద్యోగులు, సిబ్బంది కోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఏరియా జీవీటీసీ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీఎం (ఫైనాన్స్ & అకౌంట్స్) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ డీవై మేనేజర్ కె. రవి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన తరహా మోసాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు.

కార్యాలయాల్లో కంప్యూటర్ల వినియోగం నుంచి వ్యక్తిగత జీవితంలో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతాల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. సైబర్ భద్రత కేవలం ఐటీ విభాగం బాధ్యత మాత్రమే కాదని, సంస్థలోని ప్రతి ఉద్యోగి సమష్టి బాధ్యతగా భావించాలని సూచించారు.ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్, మాల్‌వేర్, ర్యాన్సమ్‌వేర్ వంటి సైబర్ దాడులపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అలాగే కాల్ ఫార్వార్డింగ్, డిజిటల్ అరెస్ట్, డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ పెట్టుబడి పథకాలు, మోసపూరిత ఫోన్ కాల్స్, హానికరమైన యాప్‌లు, ఏఐ ఆధారిత మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోకూడదని, అనుమానాస్పద లింకులు, యాప్‌లను క్లిక్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం చేయరాదని వివరించారు. సురక్షితమైన డిజిటల్ పద్ధతులను పాటించడం ద్వారా ఉద్యోగులు తమతో పాటు కుటుంబ సభ్యులను కూడా సైబర్ నేరాల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు.అనంతరం ముఖ్య అతిథి ఏజీఎం (ఎఫ్ & ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగులు కార్యక్రమంలో తెలుసుకున్న సైబర్ భద్రతా మెలకువలను తమ కుటుంబ సభ్యులు, తోటి వారికి కూడా తెలియజేసి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్, డీజీఎం (సర్వే) భూక్య దేశాయ్, జీ.వీ.టీ.సీ జేటీఓ దేవులపల్లి శ్రీనివాస్, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ కె. సుమన్‌తో పాటు జీఎం కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.