NIGAMA MEDIA (P) LTD
11.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, October 4, 2026

స్వచ్ఛతతోనే ఆరోగ్యం.. పరిశుభ్రమైన తెలంగాణే లక్ష్యం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

స్వచ్ఛ భారత్‌లో సింగరేణి కుటుంబాలు భాగస్వాములు కావాలి: జీఎం ఎన్. రాధాకృష్ణ

కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):

మహాత్మాగాంధీ కేవలం రాజకీయ స్వాతంత్ర్యాన్ని మాత్రమే కాకుండా పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆకాంక్షించారని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అన్నారు. గాంధీజీ స్ఫూర్తితో ‘స్వచ్ఛ తెలంగాణ’ లక్ష్యాన్ని సాధించేందుకు సింగరేణి కుటుంబాలన్నీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

శనివారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో ‘స్పెషల్ క్యాంపెయిన్-6 – స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని జీఎం ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలాధారమని పేర్కొన్నారు. పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం వల్ల అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తద్వారా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ వారానికి కనీసం రెండు గంటలు శ్రమదానం చేస్తూ తమ ఇళ్లు, పరిసరాలు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మనం పాటించే పరిశుభ్రత, క్రమశిక్షణ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కార్యాలయాలు, గనులు, పని ప్రదేశాల్లో పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

సింగరేణి అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పరిశుభ్రతను నిత్యకృత్యంగా మార్చుకోవాలని జీఎం సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంతో పాటు ‘రక్షణతో కూడిన ఉత్పత్తి’ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.

అనంతరం అధికారులు, ఉద్యోగులతో కలిసి ‘స్వచ్ఛ భారత్ – స్పెషల్ క్యాంపెయిన్-6’ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ఎన్విరాన్‌మెంట్ అధికారి కాతం వెంకట్‌రెడ్డి, సీనియర్ పీఓ ఎం. కార్తీక్, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు సి.వి. రమణ, జీఎం కార్యాలయ ఫిట్ సెక్రటరీ గీతికతో పాటు జీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.